బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తున్న అఖండ 2

akhanda 2 crosses 2 million ticket sales milestone on online ticket platforms

నందమూరి బాలకృష్ణ -బి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తోంది.విడుదలైన మొదటి రోజు నుండే ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుతోంది. ముఖ్యంగా నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనానికి అద్దం పట్టేలా టికెట్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కేవలం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన బుక్‌మైషో మరియు డిస్ట్రిక్ట్ యాప్‌ల ద్వారానే ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం విశేషం.ఆఫ్ లైన్ సేల్స్ కూడా బాగున్నాయి. ఈ చిత్రం సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని దీనిని ‘అఖండ భారత్ బ్లాక్‌బస్టర్’ గా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు, బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగులు మరియు ఎస్.ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులకు థియేటర్లలో మంచి అనుభూతిని ఇస్తున్నాయి.3D ఫార్మాట్‌లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండటంతో విజువల్ ఎఫెక్ట్స్ మరియు డెప్త్ కలర్ గ్రేడింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం మాస్ సెంటర్లలోనే కాకుండా, మల్టీప్లెక్స్‌లలో కూడా ఈ సినిమాకు సూపర్ సపోర్ట్ లభిస్తోంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాలోని ఆధ్యాత్మిక అంశాలను, సెంటిమెంట్‌ను బాగా ఆదరిస్తున్నారు.బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.