ఈ ఏడాది సమ్మర్ లో సింగిల్ తో వచ్చి ఎంటర్‌టైన్ చేసిన ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈహీరో , కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో యూనిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తారు. హేమ & షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు. ఈ రోజు సినిమా టీం ఒక యానిమేషన్ వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టైలిష్ యానిమేటెడ్ వీడియో ద్వారా టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని కూడా ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. అర్బన్ సెటప్‌లో సాగే ఈ గ్లింప్స్‌లో, కస్టమ్ యెల్లో మోటార్‌సైకిల్‌పై నగర వీధుల్లో దూసుకెళ్తున్న శ్రీ విష్ణు మొదటి ఫ్రేమ్ నుంచే అలరించారు. ఈ సినిమాకు ‘విష్ణు విన్యాసం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీ విష్ణు . ఆయన ట్రేడ్‌మార్క్ హ్యూమర్‌ను హైలైట్ చేస్తూ, టైటిల్ రివీల్‌కు “No Brakes – Just Laughs” అనే క్యాచీ ట్యాగ్‌లైన్ మరింత అలరించింది. “చరిత్ర, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం అన్నీ అతని కోసమే కనుగొనబడ్డాయి” అంటూ వినిపించే ప్లేఫుల్ వాయిస్‌ఓవర్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. రధన్ అందించిన స్కోర్ కూడా ఈ మొత్తం టైటిల్ వీడియోకి హ్యూమర్‌ను మరింత ఎలివేట్ చేసింది.
ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటిస్తుండగా, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలిఉంది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరిలో థియేట్రికల్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ టైటిల్ గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























