యంగ్ హీరో విశ్వక్ సేన్ – డైరెక్టర్ అనుదీప్ కెవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫంకీ.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అనుదీప్ మార్క్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో విశ్వక్ సేన్ డైరెక్టర్ గా నటించగా హీరోయిన్ కయదు లోహర్ నిర్మాత రోల్ లో కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.ఇక అనుకున్న టైం కంటే ముందే సినిమా రెడీ కావడంతో రిలీజ్ డేట్ ను కూడా ముందుకు జరిపారు మేకర్స్. ముందు ఈసినిమాను ఏప్రిల్ 3న ఫంకీ థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ కావడంతో నిన్న మళ్ళీ కొత్త డేట్ ను ప్రకటించారు. ఫిబ్రవరి 13నే ఈసినిమా విడుదలకానుంది.
ఫన్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. ఇక ఈసినిమా విజయంపై నిర్మాత నాగవంశీ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. సినిమా చూశానని, బాగా వచ్చిందని ట్వీట్ చేశాడు. అనుదీప్ బ్రాండ్ కామెడీ వర్క్ అవుట్ అయితే విశ్వక్ కు చాలా రోజుల తరువాత సాలిడ్ హిట్ పడ్డట్లే.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























