నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘అఖండ 2: తాండవం’ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, విడుదలైన అన్ని భాషల్లోనూ అఖండ విజయాన్ని నమోదు చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెల 12న ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఏకకాలంలో విడుదలై, అన్నిచోట్లా రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ముఖ్యంగా ఉత్తరాదిలో బాలకృష్ణ మాస్ యాక్షన్ మరియు అఘోరా పాత్రకు వచ్చిన స్పందన అద్భుతం.
విడుదలైన మొదటి వారం నుంచే ఈ సినిమా అన్ని భాషల్లోనూ వసూళ్ల పరంగా జోరు చూపించింది. నాలుగు రోజుల తర్వాత కూడా థియేటర్ల వద్ద అభిమానుల తాకిడి తగ్గలేదు. ఈ విజయం బోయపాటి శ్రీను మాస్ ఎలివేషన్స్ మరియు బాలయ్యలోని పవర్ డెలివరీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణను మరోసారి నిరూపించింది.
కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలోని బలమైన ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ అంశాలు ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.అలాగే, ఎస్.ఎస్.తమన్ అందించిన పవర్ఫుల్ నేపథ్య సంగీతం ఏ భాషా పరిమితి లేకుండా ప్రేక్షకులకు థియేటర్ అనుభూతిని రెట్టింపు చేసింది.ఈ విజయం బాలకృష్ణ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, ఆయన పాన్-ఇండియా మార్కెట్ స్థాయిని కూడా పెంచింది.
సంక్రాంతికి వరకు పెద్ద సినిమాల విడుదల లేకపోవడం క్రిస్మస్ ,న్యూ ఇయర్ సెలువులు ఉండడంతో అఖండ2 కి మరింత అడ్వాంటేజ్ కానుంది.ఈసినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించగా హర్షలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించారు.థమన్ సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























