హిందీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న దురంధుర్ 

Dhurandhar Shakes the Hindi Box Office

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన దురంధర్ సినిమా రికార్డులను తిరగరాస్తుంది.మొదటి రోజు  పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకున్న ఈసినిమా మౌత్ టాక్ కారణంగా రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.డిసెంబర్ 5 విడుదలై, కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 550 కోట్ల మార్కును దాటేసింది. దేశవ్యాప్తంగా నికర వసూళ్లు రూ.364.60 కోట్లు సాధించింది.నిన్న ఈసినిమా  ఇండియాలో రూ. 58.20 కోట్ల నికర వసూళ్లను రాబట్టి,  రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు నెలకొల్పింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఈ సినిమా కంటే ముందు ‘కాంతార: చాప్టర్, ఛావా, సైయారా’ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌కు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు.కందహార్ విమానం హైజాక్, 2000లో జరిగిన  పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడులు వంటి సంఘటనల నేపథ్యంలో సాగే గూఢచార కార్యకలాపాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

పాకిస్తాన్ నేపథ్యం కారణంగా అరబ్ దేశాలలో దురంధర్ సినిమాపై నిషేధం విధించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా ఇది అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ జోరు ఇప్పట్లో అలాగే కనిపించడం లేదు.ఫుల్ రన్ లో ఈసినిమా 800 కోట్ల క్లబ్ లో చేరిన ఆశ్ఛర్యపోనక్కర్లేదు.ఇక ఈసినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుండడంతో త్వరలోనే దురంధుర్ తెలుగులోనూ విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.