ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

Ustaad Bhagat Singh First Single Promo Released

గబ్బర్ సింగ్ తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈసినిమానుండి ఈరోజు మొదటి పాట ప్రోమోను రిలీజ్ చేశారు.ఈ ప్రోమో లో పవన్ సరికొత్త లుక్ లో ఎనర్జిటిక్ స్టెప్స్ వేస్తూ కనిపించాడు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే బీట్స్ ఇచ్చాడు. ఓవరాల్ గా ఈప్రోమో సాంగ్ పై అంచనాలను పెంచేసింది.ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు.ఈనెల 13న ఫుల్ సాంగ్ రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.ఈనెలలో సినిమాను కంప్లీట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇందులో పవన్ సరసన శ్రీలీల మరియు రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఇక రీసెంట్ గా ఓజీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఈసినిమా 300కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.