కెజియఫ్ 2 తరువాత కన్నడ స్టార్ యష్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా టాక్సిక్.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని అనుకున్న టైం రిలీజ్ కాకపోవచ్చు అనే వార్తలు రావడంతో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమి లేదని సినిమా విషయంలో వచ్చిన వదంతులు నమ్మొద్దు. సినిమా చెప్పిన తేదీ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుందని మేకర్స్ కంఫర్మ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు మరోసారి ఇదే విషయాన్ని పోస్టర్ ద్వారా చెప్పారు.ఈరోజు నుండి సరిగ్గా విడుదలకు 100 రోజులు వుండడడం తో కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో యష్ లుక్ ను పూర్తిగా రివీల్ చేయలేదు.
మాఫియా బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార , కియరా అద్వానీ నటిస్తుండగా భారీ బడ్జెట్ తో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. కెజిఎఫ్ 2 తరువాత యష్ నుండి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది.
ఇక యష్ ఈసినిమాతో పాటు హిందీ లో రామాయణ అనే సినిమా కూడా చేస్తున్నాడు.నితీష్ తివారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో యష్ రావణాసురిడిగా కనిపించనున్నాడు.రామాయణ రెండు భాగాలుగా రానుండగా మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























