ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలుకా నిన్నటి తో రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే రివ్యూస్ పాజిటివ్ గా వచ్చిన మొదటి వారంలో ఆశించిన స్థాయిలో వసూళ్లను మాత్రం సాధించలేకపోయింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. రామ్ అయితే చాలా పర్సనల్ గా తీసుకొని సినిమాకు అన్ని తానై వ్యవహరించాడు. కానీ అన్ సీజన్ లో విడుదలకావడంతో ఊహించిన విధంగా కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది.ఇక రెండో వారంలో సినిమా పుంజుకుంటుందని ఉంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గాఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఈసినిమా నార్త్ అమెరికాలో నిన్నటి తో 500 k డాలర్ క్లబ్ లో చేరింది.ఫుల్ రన్ లో 1 మిలియన్ క్లబ్ లో ఛాన్స్లేకపోలేదు .రామ్ ,భాగ్యశ్రీ బోర్సే అయితే సినిమా విడుదలైన రోజునుండి యూఎస్ఏ చాలా ప్రమోట్ చేశారు.
ఫ్యాన్ బయోపిక్ గా మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించగా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. వివేక్ -మెర్విన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఇక సినిమాకు రేపటి నుండి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది. ఎందుకంటే రేపు మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2 విడుదలవుతుంది.మరి ఈ పోటీని తట్టుకొని ఆంధ్ర కింగ్ ఎలాంటి పెర్ఫామెన్స్ చేస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























