నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2: తాండవం సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది.అయితే అంతకుముందే మరి కొన్ని గంటల్లో ఓవర్సీస్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయి.ఇకనార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా అదరగొడుతుంది.ఇప్పటివరకు ఈసినిమాకు అక్కడ ప్రీమియర్ షోల ద్వారా ఇప్పటివరకు 400K డాలర్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి.హిట్ టాక్ వస్తే ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజే 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నార్త్ అమెరికాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే $2.5 మిలియన్ డాలర్లు (సుమారు ₹20.84 కోట్లు) వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇక ఈసినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి.ఆంధ్రా తోపాటు తెలంగాణ లోనూ ప్రీమియర్స్ తోపాటు టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వాల నుండి అనుమతి లభించింది. హిట్ టాక్ వస్తే బాలయ్య కెరీర్ లో అఖండ 2 బిగెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.
హై వోల్టేజ్ డివోషనల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించగా హర్షాలి మల్హోత్రా , ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈసినిమాకు సంగీతం అందించగా 14 రీల్స్ నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































