అఖండ 2 తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీర సింహా రెడ్డి రాగ ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈసినిమా ఈరోజు రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమలతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. బాలకృష్ణ ,నయనతార కలిసి నటించడం ఇది నాలుగో సారి కానుంది. ఈ జోడి ఇంతకుముందు శ్రీ రామరాజ్యం , సింహ, జై సింహ సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి జత కట్టనున్నారు.
హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందించనుండగా, కాంతార వంటి చిత్రాలకు పనిచేసిన అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.
ఇక ఈసినిమా కన్నా ముందు బాలకృష్ణ అఖండ 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. డిసెంబర్ 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























