Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      January 12 Vidudala Ooty Schedule Begins

      జనవరి 12 విడుదల ఊటీ షెడ్యూల్ ప్రారంభం

      Comrade Kalyan Three-Day Box Office Collections

      కామ్రేడ్ కళ్యాణ్ 3 రోజుల్లో ఎంత రాబట్టుకుందంటే ?

      Jailer 2 Set to Score One of Kollywood’s Top 3 Biggest Openings

      కోలీవుడ్‌లో టాప్-3 బిగ్గెస్ట్ ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తున్న జైలర్ 2

      Cast Teaser Grabs Attention

       కాస్ట్ టీజర్ రిలీజ్ 

    • న్యూస్
  • రివ్యూస్
    • Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home ఇంటర్వ్యూలు ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు- డైరెక్టర్  మహేష్ బాబు 

ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు- డైరెక్టర్  మహేష్ బాబు 

By
Mahender Reddy
-
November 25, 2025
Facebook
Twitter
Pinterest
WhatsApp
    A Film Like Andhra King Taluka Has Never Come Before says Director Mahesh Babu

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.   హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్  ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బాబు పి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

    ఈ సినిమాకి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్  పెట్టడానికి కారణం ?
    -ఈ టైటిల్ కి చాలా మీనింగ్ ఉంది. అది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  
    -ఈ సినిమా 2002 టైం లో జరుగుతుంది. అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. కాబట్టి అలా పెట్టడం జరిగింది. కన్నడలో కూడా ఈ సినిమాని అదే టైటిల్తో రిలీజ్ చేస్తున్నాం.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    – ఈ సినిమాకి ముందు ‘ఆంధ్ర కింగ్’ పేరు పెట్టుకున్నాను. ఒక సీన్ రాస్తున్నప్పుడు అందులో ఎవరి తాలూకా అని డైలాగ్ వస్తుంది. అప్పుడు హీరో తన ఐడెంటిటీ గా ఫీల్ అవుతున్న ఎమోషన్ ని ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టడం జరిగింది.

    ఆంధ్ర కింగ్ క్యారెక్టర్ కోసం ఉపేంద్ర గారిని తీసుకోవడానికి కారణం?
    -రానా గారు ఉపేంద్ర గారితో ఒక ఇంటర్వ్యూ చేయడం చూశాను. అందులో ఉపేంద్ర గారు ‘నేను బయటకంటే సినిమాలోనే రియల్ మనిషి’ అని చెప్పారు. ఆ మాట నాకు చాలా కనెక్ట్ అయింది. అప్పుడే సూర్య అనే క్యారెక్టర్ ఇలా ఉంటుంది అనిపించింది. సూర్య పాత్ర కోసం మేము ఆయన్నే  సంప్రదించాము. ఉపేంద్ర గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సూర్యలో అందరు స్టార్స్ కనిపిస్తారు.  ఉపేంద్ర గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన్ని కలిసిన తర్వాత ఆయన గురించి మరింత తెలుసుకున్నాను.

    ఇది ఫ్యాన్ బయోపిక్ అన్నారు కదా మీకు అలా ఇన్స్పైర్ చేసిన ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా?
    -ఒక్క పర్సన్,  ఇన్సిడెంట్ అని చెప్పలేను. చాలా రోజుల క్రితం ఒక సినిమాకి వెళ్లాను. ఆ సినిమా నాకు అంతగా నచ్చలేదు. కానీ నా పక్కన ఉన్న ప్రేక్షకుడు ఆ డైలాగులకు చాలా ఇన్స్పైర్ అవుతున్నాడు. ప్రతి డైలాగ్ కి కనెక్ట్ అవుతున్నాడు, నిజానికి అక్కడ ఉన్న హీరోతో తనకి పర్సనల్గా ఎటువంటి కనెక్షన్ ఉండదు. కానీ తను చెప్పే ప్రతి మాటకి ఇన్స్పైర్ అవడం అనేది నాకు చాలా కనెక్టింగ్ గా అనిపించింది. అలాంటి కథని ఎవరూ చెప్పలేదనిపించింది.

    -సౌత్ ఇండియాలో హీరోస్ ని మన జీవితంలో ఒక అంతర్భాగంగా చూస్తాం. అందులో నాకు చాలా ఎమోషన్స్ కనిపించాయి. అలా ఆ ఇద్దరి రిలేషన్ లో ఒక కథ  చెప్పొచ్చు అనిపించింది.  ఫ్యాన్ ని ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాల్లో  వచ్చాయి కానీ ఇలాంటి కథతో సినిమా ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇందులో నేను చెబుతున్న కథ కంప్లీట్ డిఫరెంట్, చాలా యూనిక్.

    ఈ కథ రామ్ గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏమిటి?
    -మైత్రి మూవీ మేకర్స్ కి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు. రామ్ గారు అప్పటికే చాలా పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. నేను ఒక సినిమా మాత్రమే చేసిన దర్శకుడిని. ఆయన కాల్ చేసి 20 నిమిషాల్లో కథ చెప్పగలవా అని అన్నారు. నేను అప్పటికే పూర్తి కథని రాసుకున్నాను. ఆయనకి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదని రాత్రంతా ఆలోచించాను. ఆయనకి కలిసి కథ చెప్పాను. పూర్తి కథ విన్నారు. తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నుంచి నాకు కాల్ వచ్చింది. ‘ఆయన ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చేసిన కథ ఇదే’ అని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది

    ఈ సినిమాలో ఫ్యాన్ బాయ్ గా రామ్ గారిని ఎంచుకోవడానికి కారణం?
    -రామ్ గారు చాలా వెర్సటైల్ యాక్టర్. ఆయన క్యారెక్టర్ లో పెర్ఫార్మెన్స్ లో చాలా ఎనర్జీ ఉంటుంది . నేను రాసుకున్న పాత్రకి  గొప్ప ఎనర్జీ కావాలి. ఒక ఫ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడో ఎంత మాస్ గా ఉంటాడో అలాంటి పెర్ఫార్మర్ కావాలి. ఇలాంటి క్యారెక్టర్ కి రామ్ గారు పర్ఫెక్ట్.

    -ఈ సినిమాకి నేను రామ్ గారు అద్భుతమైన వేవ్ లెంత్ లో వర్క్ చేసాం. ఇద్దరం ఒకటే అన్నట్టుగా పని చేసాం. ఇప్పటివరకు రామ్ గారు చేసిన సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు. ఈ మాట హానెస్ట్ గా చెప్తున్నాను. ఆయన కంఫర్ట్ లెవల్ ని దాటి ఈ సినిమాని చేశారు. ఆయన ఈ క్యారెక్టర్ ఇంత అద్భుతంగా చేయడానికి ఆయన ఫ్యాన్స్ ఇన్స్పిరేషన్.

    భాగ్యశ్రీ గారి పాత్ర ఎలా ఉంటుంది?
    -భాగ్యశ్రీ గారి పాత్ర ఈ కథలో చాలా కీలకం. ఒక జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది. మురళీ శర్మగారు ,రావు రమేష్ గారు సత్య, రాహుల్ రామకృష్ణ ఇలా ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ ఒక ఎమోషన్ తో ఉంటుంది.

    మీరు పర్సనల్ గా ఎవరికి ఫ్యాన్?
    -నాకు చిన్నప్పుడు పరిచయమైంది పవన్ కళ్యాణ్ గారు, ఆయనంటే చాలా అభిమానం. అలా అని ఈ టైటిల్ పెట్టలేదు(నవ్వుతూ) తర్వాత సినిమాలో పనిచేస్తున్నప్పుడు మా గురువుగారు కృష్ణవంశీ గారికి ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఆరాధించేవాడిని. ఆయన నాకు ఒక గొప్ప మాట చెప్పారు. ‘నీకు నేనంటే కాదు సినిమా అంటే ఇష్టం. సినిమా పట్ల ఇష్టంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను దానికి ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాను. ఇకపై నువ్వు సినిమా నే ప్రేమించాలి’. ఆ మాట నన్ను చాలా కదిలించింది.

    ఉపేంద్ర గారు ఈ సినిమా చూసి కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వస్తారని చెప్పారు కదా?
    -ఆయనకి అలా అనిపించింది. మన జీవితంలో ఎవరికి ఒకరికి ఫ్యాన్ అయి ఉంటాము. మనం అభిమానించే వ్యక్తి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామనే  ఒక అంతర్గతమైన విషయం ఉంటుంది. ఇందులో అది చాలా కొత్తగా ఎక్స్ ఫ్లోర్ చేశాం.

    మ్యూజిక్ గురించి?
    -వివేక్ మెర్విన్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. వాళ్ల ద్వారా ప్రేక్షకుల నుంచి మరింత అటెన్షన్ వచ్చింది. చిన్ని గుండెలో నా ఫేవరెట్ సాంగ్. నువ్వుంటే చాలు పాట కూడా నాకు చాలా ఇష్టం. ఇందులో చంద్రబోస్ గారు రాసిన ఇంకో రెండు పాటలు ఉన్నాయి. అలాగే ఒక మంచి థీమ్ సాంగ్ ఉంది. అది కూడా నాకు ఫేవరెట్. సినిమాలో మ్యూజిక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.  

     ఇది ఫ్యాన్స్ గురించి తీసిన సినిమా కదా మరి షూటింగ్ జరుగుతున్నప్పుడు రామ్ గారి ఫాన్స్ వచ్చి కలిశారా?
    -అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్  విపరీతంగా వచ్చేవారు. అంత మంది జనం చూసినప్పుడు అక్కడ ఏదైనా షూటింగ్ జరుగుతుందనుకునేవాడిని. కానీ రామ్ గారు రాత్రి ఒంటిగంట వరకు ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇచ్చేవారు. రామ్ గారికి అభిమానులు అంటే చాలా ప్రేమ.  వాళ్ల గురించి ఎప్పుడూ చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. ఈ సినిమా ఆయన చేయడానికి కారణం ఆయన అభిమానులే.

    మైత్రి మూవీ మేకర్స్ గురించి ?
    -మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ కథకు కావలసిన ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. చాలా ఫ్యాషన్ అన్న నిర్మాతలు.

    రామ్ గారు ఈ సినిమాలో పాటలు రాయడం ఎలా అనిపించింది?
    -నిజంగా రామ్ గారికి పాటలు రాసే టాలెంట్ ఉందని నాకు తెలియదు. ఆయనకి మ్యూజిక్ పట్ల విపరీతమైన నాలెడ్జ్. మ్యూజిక్ సిట్టింగ్ కి కంపల్సరిగా వస్తారు. ఒక ట్యూన్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఎమోషన్ ని ఆయనే మాటలు రూపంలో చెప్పారు. అది నాకు చాలా నచ్చింది . తర్వాత పల్లవి కూడా రాశారు. అది మాకు అన్ని విధాలుగా ప్లస్ అయింది.

    కొత్తగా చేయబోతున్న సినిమాలు గురించి?
    -కొన్ని కథలు ఉన్నాయి. చర్చిస్తున్నాము. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాటి మీద వర్క్ చేస్తాను.

    ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
    Video thumbnail
    Mangapathi Meets Venkanna | Raju Weds Rambai Movie Interview With Sivaji | Chaitu Jonnalagadda | TFN
    13:13
    Video thumbnail
    3 Monkeys Telugu Movie Best Comedy Scenes | Sudigali Sudheer | Getup Srinu | Auto Ramprasad | TFN
    31:43
    Video thumbnail
    Kaantha Premier Show Public Talk | Kaantha Telugu Public Review | Dulquer Salmaan |Bhagyashri | Rana
    07:53
    Video thumbnail
    Vijay Deverakonda & Rashmika Mandanna Emotional Bonding | The Girlfriend Success Celebrations | TFN
    05:43

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ కి అంతా సెట్టు
      Next article100 మిలియన్లు దాటిన చికిరి చికిరి సాంగ్
      Mahender Reddy

      తాజా వార్తలు

      January 12 Vidudala Ooty Schedule Begins

      జనవరి 12 విడుదల ఊటీ షెడ్యూల్ ప్రారంభం

      October 12, 2026
      Comrade Kalyan Three-Day Box Office Collections

      కామ్రేడ్ కళ్యాణ్ 3 రోజుల్లో ఎంత రాబట్టుకుందంటే ?

      October 12, 2026
      Jailer 2 Set to Score One of Kollywood’s Top 3 Biggest Openings

      కోలీవుడ్‌లో టాప్-3 బిగ్గెస్ట్ ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తున్న జైలర్ 2

      October 12, 2026
      Cast Teaser Grabs Attention

       కాస్ట్ టీజర్ రిలీజ్ 

      October 12, 2026
      Thulabharam Title Glimpse Raises Expectations

      ఆసక్తికరంగా తులాభారం టైటిల్ గ్లింప్స్

      October 12, 2026

      తప్పక చదవండి

      Scene First Single Is Out Now

      సీన్ మ్యూజికల్ జర్నీ షురూ- ఎనర్జిటిక్ నెంబర్ అమ్మో ఇది ఎవర్రా రిలీజ్

      Itllu Arjuna Is a Completely New Kind of Love Story says Thaman

      ఇట్లు అర్జున  చాలా కొత్త లవ్ స్టోరీ – తమన్

      Hero Aneesh Talks About Itllu Arjuna

      అర్జున్ మాట మీకు వినపడకపోవచ్చు కానీ …  – అనీష్ 

      Comrade Kalyan Gets an Amazing Response from Audiences

      కామ్రేడ్ కళ్యాణ్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోం

      That Sentiment Has Been Repeated Once Again with a Sree Vishnu Film says Kona Venkat

      ఆ సెంటిమెంట్ మరోసారి శ్రీ విష్ణు సినిమాతో రిపీట్ అయింది – కోన వెంకట్ 

      Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      EDITOR PICKS

      January 12 Vidudala Ooty Schedule Begins

      జనవరి 12 విడుదల ఊటీ షెడ్యూల్ ప్రారంభం

      October 12, 2026
      Comrade Kalyan Three-Day Box Office Collections

      కామ్రేడ్ కళ్యాణ్ 3 రోజుల్లో ఎంత రాబట్టుకుందంటే ?

      October 12, 2026
      Jailer 2 Set to Score One of Kollywood’s Top 3 Biggest Openings

      కోలీవుడ్‌లో టాప్-3 బిగ్గెస్ట్ ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తున్న జైలర్ 2

      October 12, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28504
      • సినిమా వార్తలు28075
      • ఇతర వార్తలు677
      • Tollywood577
      • రివ్యూస్387
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు168
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)