తిరువీర్ మరో సినిమా లాంచ్ 

Thiruveer Kickstarts Another Film Project

రీసెంట్ గా  ప్రీ వెడ్డింగ్ షో తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ వరుస  సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అందులో భాగంగా  రీసెంట్ గా ఓ సినిమా ప్రకటించాడు. ఇందులో  తిరువీర్ హీరోగా నటిస్తుండగా తనకు జంటగా ఐష్వర్య రాజేష్ కనిపించనుంది. కామెడీ డ్రామా గా తెరకెక్కుతుంది. ఇక తాజాగా తిరువీర్  మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ సైన్ చేశారు. ఈ చిత్రానికి మహేందర్ కుడుదుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్య మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ క్లాప్ కొట్టారు. దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ కు తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు స్వరూప్ మేకర్స్ కు స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

ఈ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో సరదా, సందడితో కూడిన ఓ అద్భుతమైన ప్రేమకథగాఉండబోతోంది.ఈ చిత్రానికి జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేందర్ కుడుదుల, రవీంద్ర ఎల్వీ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. మహి డెరంగుల కాస్ట్యూమ్ డిజైనర్. కొమిరి బాలసుబ్రహ్మణ్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.ఈ చిత్రానికి సంబధించిన ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు మే  కర్స్ త్వరలో తెలియజేస్తారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.