తమిళ స్టార్ దళపతి విజయ్ కెరీర్ లో చివరి సినిమాగా వస్తుంది జన నాయగన్.ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.అయితే ఈసినిమా చెప్పినట్లుగా జనవరి 9న విడుదలకావడం లేదని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో మేకర్స్ రిలీజ్ డేట్ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి వాయిదా లేకుండా పొంగల్ కానుకగా జనవరి 9నే రిలీజ్ కానుందని పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను కూడా రివీల్ చేశారు.నిజానికి దీపావళికే ఈ సాంగ్ ను రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది. ఇక ఈసాంగ్ ఈనెల 8న రిలీజ్ కానుంది.ఈ మాస్ సాంగ్ కు విజయ్ వోకల్స్ అందించాడు .అనిరుధ్ ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తుండడంతో ఆడియోపై కూడా భారీ అంచనాలు వున్నాయి.
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఇక తెలుగులో ఈసినిమా జన నాయకుడు గా రిలీజ్ కానుంది. అయితే అయితే సంక్రాంతికి తెలుగు నుండి పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.దాంతో జన నాయకుడు తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదుర్కోనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























