రివ్యూ   : మాస్ జాతర 

mass jathara review in telugu

నటీనటులు: రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ :విధు అయ్యన్న
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
దర్శకత్వం: భాను భోగవరపు
నిర్మాతలు : సాయి సౌజన్య , నాగవంశీ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


మాస్ మహారాజా రవితేజ నటించిన 75 వ సినిమా మాస్ జాతర.ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు డైరెక్ట్ చేశాడు. సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం ,ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం అలాగే రవితేజ కంఫర్ట్ జోన్ మూవీ కావడంతో మాస్ జాతర పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈరోజు ఈసినిమా విడుదలకాగా నిన్న సాయంత్రం నుండే ప్రీమియర్స్ వేశారు. మరి ఈసినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

లక్ష్మణ్ భేరి (రవితేజ) ఒక నిజాయితీగల రైల్వే పోలీస్. తన పరిధి కాకపోయినా అన్యాయన్నీ ఎదిరించే మనస్తత్వం ఉన్నవాడు. వరంగల్‌లో ఒక మంత్రి కొడుకుకు బుద్ధి చెప్పడం వల్ల, అతన్ని అల్లూరి జిల్లాలోని అడవివరం రైల్వే స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆ ప్రాంతాన్ని శివుడు (నవీన్ చంద్ర) అనే గంజాయి స్మగ్లర్ శాసిస్తుంటాడు. లక్ష్మణ్ ఆ ఊళ్లోకి అడుగుపెట్టగానే శివుడితో వైరం మొదలవుతుంది. జిల్లా ఎస్పీ నుంచి రాజకీయ వ్యవస్థ అండగా ఉన్న శివుడి గంజాయి సామ్రాజ్యాన్ని ఒక సాధారణ రైల్వే ఎస్సై ఎలా కూలదోశాడు? ఈ కథలో తులసి (శ్రీలీల), హనుమాన్ భేరి (రాజేంద్ర ప్రసాద్) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

కొత్త దర్శకుడు భాను భోగవరపు.. రవితేజ నుంచి అభిమానులు కోరుకునే వింటేజ్ ఎనర్జీ, స్వాగ్ మరియు మాస్ యాక్షన్ అంశాలను మేళవించి తెరపై చూపించడంలో విజయం సాధించారు. రవితేజ పాత్ర పరిచయం, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫ్యాన్స్‌కు విజిల్ వేసే హై-మూమెంట్స్ చాలానే ఉన్నాయి.అయితే, కథలో కొత్తదనం లోపించింది. ఇది రవితేజ గతంలో చేసిన రొటీన్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల మాదిరిగానే అనిపిస్తుంది.

ప్రథమార్థం : ఫ్యామిలీ నేపథ్యాన్ని, పెళ్లి కానివ్వకపోవడానికి గల కారణాలను ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. విలన్ శివుడి విలనిజం, గంజాయి స్మగ్లింగ్ దందా పరిచయం ఫర్వాలేదు. హీరో అడవివరం వెళ్లి శివుడి గ్యాంగ్‌తో గొడవ పడటంతో కథ కొంచెం వేగం పుంజుకుంటుంది. ఊరి ప్రజలతో కలిసి హీరో చేసే యాక్షన్ సీక్వెన్స్ థ్రిల్‌ను పంచుతుంది.

ద్వితీయార్థం : హీరో దాచిపెట్టిన సరుకును విలన్ గ్యాంగ్ కనిపెట్టే పాయింట్ చుట్టూనే కథ నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే అడవి ఫైట్ సీక్వెన్స్, క్లైమాక్స్‌కి ముందు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌గా రాజేంద్రప్రసాద్ చేసే యాక్షన్ హంగామా ప్రేక్షకులను అలరిస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే రవితేజ ఈ సినిమాని పూర్తిగా తన భుజాలపై మోశారు. వింటేజ్ ఎనర్జీ, కామెడీ టైమింగ్‌, ఫైట్స్, పాటల్లో ఆయన హుషారు ప్రేక్షకులను మెప్పిస్తాయి. శ్రీలీల మూడు కోణాల్లో సాగే పాత్రలో ఆకట్టుకుంది. రవితేజతో కలిసి వేసిన స్టెప్పులు అలరిస్తాయి. రాజేంద్ర ప్రసాద్ తాత పాత్రలో కామెడీ పండించారు. మిగితా నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

టెక్నికల్ గా కూడా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఆకట్టుకున్నాయి. భీమ్స్ సంగీతం డీసెంట్ అనిపిస్తుంది. బీజీఎమ్ మాత్రం బాగా ఇచ్చాడు. ఎడిటింగ్ ఒకే. నిర్మాతలు సినిమాకు బాగానే ఖర్చు చేశారు. ఆ ఖర్చు తెరపై కనిపిస్తుంది.

ముగింపు :

మాస్ జాతర అనేది రవితేజ అభిమానులకు ఆయన ఎనర్జీతో కూడిన యాక్షన్, ఫైట్స్ మరియు పాటలతో కూడిన మాస్ ట్రీట్.ఇందులో రవితేజ నటన ,యాక్షన్ సీక్వెన్స్ , విజువల్స్ హైలైట్ అయ్యాయి. కొత్తదనాన్ని ఆశించకుండా కేవలం మాస్ యాక్షన్ కోరుకునేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.