ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు ,యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ క్రమంలో శిరీష్ , నయనిక రెడ్డితో కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించడానికి మొదటి అడుగుగా నిశ్చితార్థం వేడుకను ఘనంగా జరుపుకున్నారు.శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈవేడుకలో శిరీష్, నయనిక ఉంగరాలు మార్చుకున్నారు.ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు,కొద్దిమంది బంధువులు ఈ కార్యక్రమనికి హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విచ్చేసి సందడి చేశారు.మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కాబోయే దంపతులను ఆశీర్వదించారు.ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు శిరీష్ నుండి చివరగా వచ్చిన సినిమా బడ్డీ .ఈసినిమా 2024 లో విడుదలైంది. ఆతరువాత శిరీష్ ఇప్పటివరకు మరో సినిమా ప్రకటించలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























