నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఏ సర్టిఫికెట్ తో జటాధర థియేటర్లలోకి రానుంది. రేపు హైదరాబాద్ లోని అవాస హోటల్ లో సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.సుధీర్ బాబు ఈసినిమానుగట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు. మరి ఈసినిమా తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఈ చిత్రంలో దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేక సుధాకర్‌తో పాటు ప్రముఖ నటీ నటులు కనిపించనున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరించారు.జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























