ఆంధ్ర కింగ్ తాలూకా థర్డ్ సింగిల్ రిలీజ్

Andhra King Thaluka Third Song Out Now

ఉస్తాద్ రామ్ పోతినేని – మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.ఇప్పటివరకు ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈరోజు థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈసాంగ్ కూడా అదిరిపోయింది.చిన్ని గుండెలో అంటూ వచ్చిన ఈసాంగ్ పొయెటిక్ గా ఉండి ఆకట్టుకుంది. సాంగ్ చిత్రీకరణ కూడా బాగుంది.ఈ సాంగ్ కోసం దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టారు. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా మెర్విన్ సోలమన్ ,సత్య యామిని పాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో కనిపించనున్నాడు.అతని అభిమానిగా సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నాడు.తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28 న ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లోకి రానుంది.

అయితే ఈసినిమాను కుదిరితే ఒక రోజు ముందు గానే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈసినిమా విజయం రామ్ కు కీలకం కానుంది. రామ్ చివరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం తో ఆంధ్ర కింగ్ తాలూకా తో ఎలాగైనా హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు రామ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.