స్టేజ్ మీద ఎమోషనల్ అయిన భీమ్స్ సిసిరోలియో

Music Director Bheems Ceciroleo Turns Emotional at Event

ధమాకా తరువాత వరుస ఆఫర్ల తో ఫుల్ బిజీ అవుతున్నాడు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాంతో తన పేరు మారుమోగిపోయింది.ఇక భీమ్స్ సంగీతం అందించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా వుంది. ఈ ఆల్బమ్ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా తన జీవితంలోని కష్టాల గురించి, మాస్ మహారాజా రవితేజ తనకు ఎలా సహాయం చేశారనే విషయం గురించి ఈ ఈవెంట్‌లో భీమ్స్ భావోద్వేగంతో మాట్లాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడిగా ఎంతోమందిని అలరిస్తున్న తాను ఒకానొక దశలో అవకాశాలు లేక, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు భీమ్స్ చెప్పుకొచ్చాడు. అద్దె ఎలా కట్టాలి, పిల్లలను ఎలా చదివించాలి, ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ… చివరికి తన భార్య, పిల్లలు కూడా కనిపించేలా తన దయనీయ పరిస్థితిని వివరిస్తూ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నానని తెలిపారు.

అయితే, భూమి మీద తమకు నూకలు చెల్లిపోయాయని, అందరం కలిసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోదామని అనుకుంటున్న చిట్టచివరి క్షణంలో తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, అది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని భీమ్స్ చెప్పారు.పీపుల్స్ మీడియా ఆఫీసుకు రమ్మని వచ్చిన ఆ కాల్, తాను కొలిచే దేవుడి రూపంలో రవితేజ నుంచే వచ్చిందని ఎమోషనల్ అయ్యారు.నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే, రోజూ అన్నం తింటున్నానంటే… ఆయనే (రవితేజ) కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను సజీవంగా ఉన్నానంటే రవితేజనే కారణం అని భీమ్స్ ఎమోషనల్ అయ్యారు.రవితేజ అంటే తనకు మాటల్లో చెప్పలేని ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి అని పేర్కొన్నారు. రవితేజ లాంటి వ్యక్తులు చిత్ర పరిశ్రమలో ఉంటే, తనలాంటి ఎంతోమంది వస్తారని, ఆయన చాలా మందికి స్ఫూర్తి అని కొనియాడారు.

2012లో ‘నువ్వానేనా’తో కెరీర్‌ను ప్రారంభించిన భీమ్స్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇక రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వం వహించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.