తమిళ హీరో ధనుష్ నటించి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇడ్లీ కడై. ఈనెల 1న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద 70కోట్ల వసూళ్లను రాబట్టుకొని డీసెంట్ హిట్ అనిపించుకుంది. అయితే అదే టైంలో కాంతార చాప్టర్ 1 కూడా విడుదలకావడంతో ఇడ్లీ కడై అనుకున్న వసూళ్లను సాధించలేకపోయింది. ఈసినిమాను తెలుగులో ఇడ్లీ కొట్టు గా శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ విడుదలచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను అన్ని భాషల్లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. మరి ఓటీటీ లో ఈసినిమాను ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ విజయ్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జీవీ ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందించగా ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వుండర్బార్ ఫిలిమ్స్ నిర్మించింది.
ఇక ఈసినిమా తరువాత ధనుష్ నెక్స్ట్ హిందీ మూవీ తేరే ఇష్క్ మే తో రానున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.నవంబర్ 28న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























