అనీష్ విషయంలో చాలా గర్వంగా ఉంది - నాగార్జున
Nagarjuna Says He Is Very Proud of Aniesh for Itllu Arjuna

కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హార్ట్బస్టర్ ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం థాంక్ యూ మీట్ నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. “మీ హుషారు, ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలుమార్లు మాట్లాడాను. ఈ సినిమాను నేను ప్రజెంట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. అనీష్ విషయంలో చాలా గర్వంగా ఉంది. అలాగే అనస్వర, మహేష్‌తో పాటు ప్రతి ఒక్కరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ వేడుకలో అనీష్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ పిలిచి థాంక్స్ చెప్పడం నాకు చాలా నచ్చింది. తెలుగు సినిమా ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కొత్త టాలెంట్‌ను, కొత్తదనాన్ని వాళ్లు ఎంతో ఎంకరేజ్ చేస్తారు. చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ నన్ను అన్నా అని పిలుస్తాడు. మా అబ్బాయి అఖిల్ ఏమో చిరంజీవి గారిని పెదనాన్న అంటాడు. మరి ఆయన్ని నేను ఏమని పిలవాలో అర్థం కావడం లేదు (నవ్వుతూ). సో.. ఈరోజు బాస్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. రామ్ చరణ్ నన్ను అన్నా అంటాడు కాబట్టి, నేను కూడా చిరంజీవి గారిని అన్నా అని పిలుస్తాను. చిరంజీవి గారు ఈ వేడుకకు వచ్చి టీంను బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
వీడియోస్










