కొత్త హీరో సినిమాకు ఇంత సపోర్ట్ రావడం నిజంగా నా అదృష్టం -హీరో అనీష్
A New Hero Receiving This Much Support Is Truly My Good Fortune says Aniesh

కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హార్ట్బస్టర్ ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం థాంక్ యూ మీట్ నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
హీరో అనీష్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చిరంజీవి గారి అభిమానులకు, అక్కినేని నాగార్జున గారి అభిమానులకు థాంక్యూ సో మచ్. నాగార్జున గారిది చాలా పెద్ద మనసు. ఆయనను కలిసినప్పటి నుంచి నాకు అందించిన సపోర్ట్, ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే మెమరీ. ప్రతి ఇంట్లో చిరంజీవి గారి పేరు వినిపిస్తుంది. ఎవరైనా సినిమాల్లోకి వెళ్లాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా ‘నువ్వు ఏమైనా చిరంజీవి అన్నా?’ అని అంటుంటారు. ఆయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అలాంటి వారిలో నేను కూడా ఒకడిని. ఆయన సమక్షంలో ఈ వేదికపై నిలబడి మాట్లాడటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు అర్జున’ రెండేళ్ల జర్నీ. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ థాంక్యూ. సినిమా చూసిన వాళ్లందరూ చాలా బాగుందని చెప్తున్నారు.
ముఖ్యంగా యాక్షన్ బాగుందని, మ్యూజిక్ బాగుందని అభినందిస్తున్నారు. వందమంది సినిమా చూస్తే అందులో 90 మందికి అర్జున్ ప్రేమ వినిపించింది. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని నమ్మిన వెంకీ అన్నకు థాంక్యూ. ఇలాంటి మంచి కథ రాసి నన్ను నమ్మిన మా డైరెక్టర్ మహేష్‌కు థాంక్యూ. ఈ జర్నీలో ఆయన నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. మా సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన తమన్ ప్రతి పాట కోసం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తారక్ అన్న, చరణ్ అన్న, నాని అన్న.. ఇలా అందరికీ థాంక్యూ. మహేష్ బాబు గారి లాంటి సూపర్‌స్టార్స్‌తో పాటు ఎంతోమంది నటీనటులు మా సినిమా గురించి ట్వీట్ చేశారు. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక కొత్త హీరో సినిమాకు ఇంత సపోర్ట్ రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంకా థియేటర్లలో మా సినిమాను చూస్తారని కోరుకుంటున్నాను. ఇది నా తొలి అడుగు. నన్ను ఇంతగా ప్రోత్సహించిన, నాపై నమ్మకం ఉంచిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు.
వీడియోస్










