కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

ఇట్లు అర్జునకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - అనస్వర రాజన్

ఇట్లు అర్జునకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది -  అనస్వర రాజన్

ఇట్లు అర్జునకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - అనస్వర రాజన్

Anaswara Rajan Says Itllu Arjunaku Is Receiving an Excellent Response Everywhere

ఇట్లు అర్జునకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది -  అనస్వర రాజన్

కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హార్ట్‌బస్టర్ ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం థాంక్ యూ మీట్ నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ.. “ఇది చాలా బ్యూటిఫుల్ జర్నీ. గత కొన్ని రోజులుగా మేము థియేటర్లను విజిట్ చేస్తున్నాం. అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌కు, ప్రొడ్యూసర్‌కు థాంక్యూ. మేము థియేటర్ విజిట్స్‌కు వెళ్లినప్పుడు అనీష్ పర్ఫార్మెన్స్‌ను ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తను మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారు మనందరికీ ఇన్‌స్పిరేషన్. ఆయన ఈ వేడుకకు వచ్చి బ్లెస్ చేయడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. నాగార్జున గారు మా సినిమాను ప్రజెంట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”

వీడియోస్

ఇట్లు అర్జునకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది -  అనస్వర రాజన్
సినిమాఇట్లు అర్జున3 కథనాలు · సినిమా పేజీ →

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్