చారిత్రక కోటపై అక్కినేని హీరో.. వృషకర్మ కోసం నాగచైతన్య స్పెషల్ టూర్
Naga Chaitanya Visits a Historic Fort for Vrushakarma

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య పెద్దపల్లి జిల్లాలోని చారిత్రక రామగిరి ఖిల్లాపై సందడి చేశారు . తన తదుపరి చిత్రం ‘వృషకర్మ’ ప్రమోషన్లలో భాగంగా ఆయన ప్రముఖ యూట్యూబర్ ‘జస్టి’ తో కలిసి మంగళవారం ఈ పురాతన కోటను ట్రెక్కింగ్ చేశారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సాహసోపేతమైన ట్రెక్కింగ్ సందర్భంగా నాగచైతన్య ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ త్వరలోనే విడుదల కానుంది.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు ఖిల్లాపైనే గడిపిన నాగచైతన్య, కోట పరిసర ప్రాంతాలన్నింటినీ కాలినడకన చుట్టివచ్చారు. అక్కడి పురాతన కట్టడాలు, చారిత్రక ఆలయాలు, శతాబ్దాల నాటి ఫిరంగిని ఆయన ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. ఈ ట్రెక్కింగ్‌లో నాగచైతన్య, యూట్యూబర్ జస్టి బృందం వెంట ప్రముఖ పర్వతారోహకుడు, మాజీ సైనికుడు లెంకల మహిపాల్‌రెడ్డి ఉండి ఖిల్లా విశేషాలను వివరించారు.
కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
వీడియోస్










