కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

తొలి సినిమాతోనే అనీష్ ఆ అదృష్టాన్ని పొందగలిగాడు - మెగాస్టార్ చిరంజీవి

 తొలి సినిమాతోనే అనీష్  ఆ అదృష్టాన్ని పొందగలిగాడు -   మెగాస్టార్ చిరంజీవి

తొలి సినిమాతోనే అనీష్ ఆ అదృష్టాన్ని పొందగలిగాడు - మెగాస్టార్ చిరంజీవి

Aniesh Achieved That Rare Feat with His Very First Film says Chiranjeevi

 తొలి సినిమాతోనే అనీష్  ఆ అదృష్టాన్ని పొందగలిగాడు -   మెగాస్టార్ చిరంజీవి

థాంక్ యూ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడి వాతావరణం చూస్తుంటే నిజమైన సక్సెస్ అంటే ఏంటో మీ ఉత్సాహంలోనే తెలుస్తోంది. ఈ ఎనర్జీ చూస్తుంటేనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అర్థమవుతోంది. హీరో అనీష్ చాలా అదృష్టవంతుడు. ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది హీరోలు ఒక డెబ్యూ హీరోకు ఈ స్థాయిలో సపోర్ట్ చేయడం చాలా అరుదు. అది ఒక్క అనీష్‌కే దక్కింది. ఈ సినిమాలోని ఒక సాంగ్‌ను నాని రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను తారక్ రిలీజ్ చేశారు. కింగ్ నాగార్జున గారు ఈ సినిమాకు వెన్నుముకలా నిలిచారు. రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు. ఇప్పుడు నేను ఈ వేడుకకు వచ్చాను. అంతేకాదు, ఈ సినిమా ప్రీమియర్స్‌కు వెంకటేష్ గారితో పాటు ఎంతోమంది వచ్చి అనీష్‌ను అభినందించారు. ఇంతమంది ఈ సినిమాను ఎందుకు ప్రేమిస్తున్నారు? ఇంతగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అనే ఆలోచన మీకు రావచ్చు. దానికి కారణం నా మిత్రుడు మహేష్ రెడ్డి. ఆయన చేసుకున్న పుణ్యం, బాబాపై ఆయనకున్న భక్తి, సినిమా మీద ఆయనకున్న ప్రేమ, అభిమానం ఇవన్నీ ఈ సినిమాకు ఇంతటి సపోర్ట్ రావడానికి కారణమయ్యాయి. వ్యాపారంలో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ సినిమాపై ఆయనకున్న ప్రేమ, భక్తిభావం ప్రత్యేకమైనవి. నాగార్జున గారితో ఆయనకు ఉన్న అనుబంధం, గతంలో కలిసి చేసిన సినిమాల వల్ల ఈ సినిమా పట్ల కూడా ఆయనకు ప్రత్యేకమైన మక్కువ ఏర్పడింది. వాళ్ల అబ్బాయికి కూడా సినిమాలపై ఆసక్తి కలగడం, నటన వైపు రావడం, తల్లిదండ్రులు అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంత అద్భుతమైన టాలెంట్, ఆసక్తి ఉన్న అనీష్ ను మనం కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అతని వెనుక నిలబడ్డారు. ప్రేక్షకులు కూడా సినిమా కంటెంట్ నచ్చి విజయాన్ని అందించారు.

‘ఇట్లు అర్జున’ యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. గతంలో పెద్ద ఈవెంట్ సినిమాలు ఉన్నప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించేది. కానీ గత రెండేళ్లుగా చిన్న సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు పరిశ్రమ కొత్తవాళ్లతో కళకళలాడుతోందంటే దానికి కారణం యంగ్ టాలెంట్. యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ సినిమా పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని, ఊపును తీసుకొచ్చి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నారు. అందుకే యంగ్ రైటర్స్, డైరెక్టర్స్‌కు నా అభినందనలు. సీనియర్ డైరెక్టర్లు ఇండస్ట్రీకి గౌరవం తీసుకురావచ్చు. కానీ కొత్త కథలతో, కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే బాధ్యతను యంగ్ టాలెంట్ కూడా అద్భుతంగా నిర్వహిస్తోంది. ‘ఇట్లు అర్జున’ సినిమా వెనుక కూడా మంచి యంగ్ టీమ్ ఉంది. హీరో అనీష్, హీరోయిన్ అనస్వర, ప్రొడ్యూసర్ వెంకీ కుడుముల, డైరెక్టర్ మహేష్.. ఇలా అందరూ మంచి యంగ్ టాలెంట్. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి వీళ్లంతా ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి కొత్త టాలెంట్ ఇంకా రావాలి. ఈ పరిశ్రమ ఒక జీవనదిలా నిరంతరం కొనసాగుతుంటే ఎంతోమంది బాగుపడతారు, అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు మధ్యాహ్నమే సినిమా చూశాను. అనీష్ తన హావభావాలతో, బాడీ లాంగ్వేజ్‌తో ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నాడు. మాటలు లేకుండా తనవైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ఒక కొత్త నటుడికి చాలా కష్టం. ‘గీతాంజలి’లో నాగార్జున గారు క్యాన్సర్ పేషెంట్‌గా, ‘పున్నమినాగు’ నేను చేసిన పాత్ర, వినికిడి లోపం ఉన్న పాత్రలో ‘రంగస్థలం’లో చరణ్, లెనిన్ లో అఖిల్, మొన్నటికి మొన్న సూర్య సీన్ లో బ్లైండ్ క్యారెక్టర్‌లో.. ఇలా హీరో పాత్రల్లో ఏదైనా లోపం ఉండేలా చూపించడం ఒక ఛాలెంజ్. వాళ్లంతా తమ అనుభవంతో ఆ ఛాలెంజ్‌ను నిరూపించుకున్నారు. కానీ అలాంటి ఛాలెంజింగ్ రోల్ అనీష్‌కు తొలి సినిమాకే రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం. తొలి సినిమాతోనే ఆ అదృష్టాన్ని అనీష్ పొందగలిగాడు. తనకు హ్యాట్సాఫ్.

ఇలాంటి మరిన్ని మంచి, అద్భుతమైన పాత్రలతో ముందుకు వెళ్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. అనస్వర తన పాత్రలోని విభిన్న కోణాలను చాలా బాగా ప్రజెంట్ చేసింది. ఆమె నటన నాకు చాలా నచ్చింది. అలాగే ఈ సినిమాను డైరెక్టర్ మహేష్ చాలా వైవిధ్యంగా తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. సినిమాలో ప్రేమకథను బ్లెండ్ చేసిన విధానం, స్క్రీన్‌ప్లే చాలా బాగున్నాయి. అందుకే మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు సినిమా మనల్ని కట్టిపడేస్తుంది. మహేష్‌కు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తను ‘కాకా’ సినిమా కూడా చేస్తున్నాడు. కచ్చితంగా ఆ సినిమాతో కూడా కొడతాం. ఇట్లు అర్జున్ థియేటర్లలో చూడండి. రెండున్నర గంటల ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. ఈ సినిమా ఎంత బాగుంటే నాగార్జున గారు అంతగా భుజాన వేసుకుంటారు. వెంకీ కుడుముల ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారాడు. నిజానికి తన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నాతో ఒక సినిమా చేయమని కూడా అడిగాను. మంచి కథతో వస్తానని చెప్పాడు (నవ్వుతూ). తను నిర్మాతగా కూడా మంచి విజయం సాధించాడు. మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అందరికీ హృదయపూర్వక అభినందనలు. జైహింద్!

వీడియోస్

 తొలి సినిమాతోనే అనీష్  ఆ అదృష్టాన్ని పొందగలిగాడు -   మెగాస్టార్ చిరంజీవి
సినిమాఇట్లు అర్జున5 కథనాలు · సినిమా పేజీ →

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్