
ట్యాగ్ · 12 కథనాలు


ది గర్ల్ ఫ్రెండ్ కోసం రానున్న విజయ్ దేవరకొండ

ది గర్ల్ ఫ్రెండ్ సెన్సార్ కంప్లీట్

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ సాంగ్ రిలీజ్

రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ అప్‌డేట్

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్‌పై సుకుమార్ ప్రశంసలు

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ వాయిదా

రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ అప్ డేట్

రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ షూటింగ్ మొదలు

రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ గ్రాండ్ లాంచ్

ది గర్ల్ ఫ్రెండ్ 10 డేస్ కలెక్షన్స్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్ ఫ్రెండ్' నవంబర్ 7న విడుదలై బస్టర్ దిశగా దూసుకుపోతుంది. రెండో వారంలో కూడా ఈసినిమా సాలిడ్ హోల్డ్ కొనసాగిస్తూ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేయడంతో బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొస్తుంది.10 రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా 28.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఫుల్ రన్ లో 35కోట్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ లేకపోలేదు.

ది గర్ల్ ఫ్రెండ్ కోసం రానున్న విజయ్ దేవరకొండ
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. వీకెండ్‌లో మాత్రమే కాకుండా, వీక్ డేస్‌లో కూడా ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండటంతో, చిత్రబృందం నవంబర్ 12న సక్సెస్ మీట్‌ను నిర్వహించాలని నిర్ణయించుకుంది.ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. రేపు ఈ ఈవెంట్ పార్క్ హయత్ లో సాయంత్రం 6 గంటలకు జరుగనుంది.

ది గర్ల్ ఫ్రెండ్ సెన్సార్ కంప్లీట్
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ చిత్రం 2 గంటల 18 నిమిషాల రన్ టైం తో థ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.సినిమా విజయంపై అయితే టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్
క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు , హిందీ ల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న ఈ నటి, ఇప్పుడు 'ది గర్ల్‌ఫ్రెండ్' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ ను కూడా విడుదలచేశారు. ఇక ఈ ట్రైలర్ ను ఎమోషనల్ టచ్ తో ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్-కామెడీ చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈసినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది.థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల అక్టోబర్ 25న విడుదల చేయబోతున్నారు.

రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ సాంగ్ రిలీజ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ ప్రస్తుతం జోరుమీదుంది. వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఆమె నటించిన గత రెండు చిత్రాలు 'పుష్ప 2: ది రూల్' మరియు 'ఛావా' బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్నాయి. ప్రస్తుతం రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ట్యాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి ఆమెకు జోడీగా కనిపించనున్నాడు.

రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ అప్‌డేట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. కాగా వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది.

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్‌పై సుకుమార్ ప్రశంసలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు.

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ వాయిదా
తన సినిమాలతో నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ అప్ డేట్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది రష్మిక మందన్న. పుష్ప, యానిమల్ సినిమాల తరువాత రష్మిక క్రేజ్ దేశవ్యాప్తంగా మారిపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు ఇప్పుడు రష్మిక లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దీనిలో భాగంగానే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ షూటింగ్ మొదలు
ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. ఇన్ని రోజులు యానిమల్ సినిమాతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు తన కొత్త సినిమాలతో బిజీ అయిపోతుంది. ప్రస్తుతం పలు సినిమాలు రష్మిక లిస్ట్ లో ఉన్నాయి. ఒకపక్క హీరోల పక్కన చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ గ్రాండ్ లాంచ్
స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార, సమంత ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉండగా వారితో పాటు కీర్తి సురేష్ ఇంకా పలువురు హీరోయిన్లు ఇప్పటికే లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేయగా.. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఆలిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికే రెయిన్ బో సినిమాను లైన్ లో పెట్టాడు. తాజాగా మరో సినిమా లాంచ్ అయింది.