డ్యూడ్ చేయడానికి అల్లు అర్జున్ ఆర్య స్ఫూర్తి – డైరెక్టర్ కీర్తిశ్వరన్

Allu Arjun’s Arya Inspired Me to Make Dude says Director Keerthiswaran

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో  ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ డైరెక్టర్ కీర్తి ఈశ్వరన్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఇది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నేను స్క్రిప్ట్ రాసుకుని దర్శకుడు కావాలనుకున్న తర్వాత చెన్నై మొత్తం తిరిగాను. ఫైనల్ గా ఇక్కడ జూబ్లీహిల్స్ లో నా సినిమా జర్నీ మొదలైంది. నా కలలో కూడా మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేస్తానని అనుకోలేదు. తెలుగు దర్శకులంతా వచ్చి  మాకు బ్లెస్సింగ్ ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చింది.  ప్రదీప్ గారు తెలుగు ఆడియన్స్ గురించి చాలా ఆలోచిస్తారు.  నేను ఈ సినిమా చేస్తున్న క్రమంలో ప్రతి సీన్ చదివి ఇవి ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనే వారు. మమిత చాలా స్వీట్. ఈ సినిమాలో ఒక డిఫరెంట్  మమితని చూస్తారు. 

 అల్లు అర్జున్ గారి ఆర్య,  ఈ స్క్రిప్ట్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. మ్యూజికల్ సెన్సేషన్ సాయికి థాంక్యూ. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో బాగుండు పో అనే పాట ఉంది. ఈ సినిమాకు కోర్ కూడా అదే. తెలుగు ఆడియన్స్ మంచి ఎమోషన్స్, జెన్యూన్ ఫిలిం ఇష్టపడతారు.  దీపావళి తో పాటు ఈ సినిమా సెలబ్రేట్ చేసుకొనేలా వుంటుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.