తమిళ స్టార్ హీరో సూర్య ప్రముఖ కమెడియన్ ఆర్ జె బాలాజీ డైరెక్షన్ లో నటించిన సినిమా కరుప్పు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఈ దీపావళికి ఈ సాంగ్ ను వదలనున్నారు. ఈ మాస్ సాంగ్ లో సూర్య డ్యాన్స్ హైలైట్ అవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష కథానాయికగా నటించగా స్వసికా ,కాళీ వెంకట్ ,నటరాజన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యకంర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక సూర్య ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన 46వ సినిమా చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత సూర్య తెలుగులో సినిమా చేస్తున్నాడు. సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇందులో ప్రేమలు బ్యూటీ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగ వంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























