గత వారంలో భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది. నిన్నటి తో ఈసినిమా ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఇక 7రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 509కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో కెజిఎఫ్ 2 తరువాత 500కోట్ల క్లబ్ లో చేరిన రెండో కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా కర్ణాటకలో ఈసినిమా సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో అక్కడ 120కోట్ల మార్క్ ను చేరుకుంది.ఫుల్ రన్ లో 200కోట్ల క్లబ్ లో చేరనుంది. నిన్నటి తో కేరళలో 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని హిట్ అనిపించుకుంది.
ఇక హిందీలో మొదటి వారం 110 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.అయితే దీపావళికి నాలుగు సినిమాలు విడుదలవుతుండడంతో కాంతార చాప్టర్ 1 కు తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.ఇక ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఓవరాల్ గా మరో 200కోట్ల వసూళ్లను రాబట్టుకోవాల్సివుంది.
బ్లాక్ బస్టర్ కాంతార కు ప్రీక్వెల్ గా రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























