ఓటీటీ లోకి వచ్చేసిన వార్ 2.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

War 2 Now Streaming on OTT, Featuring The Epic NTR-Hrithik Face-Off

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల అంచనాలను అందుకుని థియేటర్లలో సంచలనం సృష్టించిన యాష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ చిత్రం ‘వార్ 2’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మరియు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన ఈ హై-యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయితే స్టార్ హీరోల కాంబినేషన్ కారణంగా మూవీ లవర్స్ ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘వార్ 2’ స్ట్రీమింగ్

ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఆల్రెడీ చూసిన ఆడియెన్స్ హై ఆక్టేన్ యాక్షన్‌ను మళ్లీ రివిజిట్ చేయాలనుకునే వారికి, లేదా మొదటిసారి చూడబోయే వారికి — ఇది ఓ పవర్‌ప్యాక్ యాక్షన్ ఫీస్ట్‌గా నిలుస్తోంది! సో, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడని వారు, ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేసేయవచ్చు.

హోరాహోరీగా.. తారక్, హృతిక్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో ఎన్టీఆర్ ‘ఏజెంట్ విక్రమ్’ పాత్రను పోషించగా.. హృతిక్ రోషన్ ‘కబీర్’ అనే అండర్ కవర్ ఏజెంట్ పాత్రలో కనిపించారు. హృతిక్ రోషన్ తన స్టైల్, ఇన్టెన్సిటీతో స్క్రీన్‌ను ఊపేస్తే, ఎన్టీఆర్ తన మాస్ ఎనర్జీతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్‌లో మెరిశాడు. ఇద్దరి మధ్య జరుగే మైండ్ గేమ్స్, హోరాహోరీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పవర్‌ఫుల్ డైలాగ్‌లు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టాయి. కాగా, ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, ఆదిత్య చోప్రా నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.