పెద్ది.. నెక్స్ట్ షెడ్యూల్ అప్‌డేట్

Team Peddi To Shoot a Spectacular Song From Tomorrow in Pune

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రేపు పూణేలో ప్రారంభమయ్యే నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ కోసం టీం సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్‌పై అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు. అకాడమీ అవార్డు విన్నర్ మాస్ట్రో AR రెహమాన్ అదిరిపోయే సాంగ్‌ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ కి స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉండనుంది.

సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ కొనసాగుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం సినిమా పూర్తయ్యేలా టీమ్ పాషన్‌తో పనిచేస్తోంది. కాగా, రామ్ చరణ్ తన పాత్ర కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2026న పెద్ది గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.