యంగ్ హీరో రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘శశివదనే’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం నైజాం ప్రాంత పంపిణీ హక్కులను బడా సంస్థ సొంతం చేసుకుంది. ఈ మేరకు విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిప్రకారం, టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ హౌస్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ అయిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రం నైజాం రైట్స్ దక్కించుకుంది. అయితే ఇది చిన్న సినిమానే అయినప్పటికీ, మూవీ కంటెంట్ మరియు క్వాలిటీపై నమ్మకంతోనే మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ హక్కులను తీసుకున్నట్లు సమాచారం.
కాగా, ఈ చిత్రం గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే పల్లెటూరి ప్రేమకథగా రూపొందింది. రక్షిత్ అట్లూరి కొత్త లుక్‌లో కనిపిస్తుండగా, కోమలీ ప్రసాద్ నటన, అందం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నాగబాబు, తులసి మరియు అనంత చక్రవర్తి నటించారు.
మైత్రీ లాంటి పెద్ద సంస్థ మద్దతు లభించడంతో, ‘శశివదనే’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఒక మంచి రొమాంటిక్ కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నైజాంలో విడుదల చేస్తుండటంతో, సినిమాకు మరింత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.
గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించిన ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























