డ్యూడ్ ట్రైలర్ రిలీజ్

Dude Trailer Out Now

లవ్ టుడే ,డ్రాగన్ లతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నెక్స్ట్ డ్యూడ్ తో వస్తున్నాడు.ఈనెల 17న రిలీజ్ కానుంది. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించింది. సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ రోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది. యూత్ కు నచ్చేలా ట్రైలర్ ను కట్ చేశారు. ఇందులో ప్రదీప్ స్వాగ్ , మేనరిజం హైలైట్ అయ్యాయి. పక్కోడి ఫీలింగ్స్  ను  క్రింజ్ గానే చూడడమే కదా ఇప్పుడు ట్రెండ్ లాంటి డైలాగ్స్ బాగున్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.లవ్ టుడే , డ్రాగన్ సినిమాలతో ప్రదీప్ తెలుగులో కూడా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.సో డ్యూడ్ హిట్ టాక్ తెచ్చుకుంటే తెలుగులోకూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.

డ్యూడ్ లో ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించగా నేహా శెట్టి ,శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. ఈసినిమా 2 గంటల 19 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.