టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారుకు జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఓ బొలెరో వాహనం విజయ్ కారును ఢీకొట్టగా, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, ఉండవల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ ప్రమాదంలో ఆయన కారు కొంత దెబ్బతిన్నప్పటికీ, విజయ్‌కి గానీ, ఆయన కుటుంబసభ్యులకు కానీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక ఈ ప్రమాద వార్త తెలియగానే అభిమానులు ఆందోళన చెందగా, వారి కోసం విజయ్ దేవరకొండ వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరుతూ ఆయన చేసిన ట్వీట్ అభిమానులకు ఊరటనిచ్చింది.
**ప్రమాదంపై దేవరకొండ ట్వీట్..
“అంతా బాగానే ఉంది. కారుకు దెబ్బ తగిలింది, కానీ మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇంటికి రాగానే వెంటనే వెళ్లి స్ట్రెంత్ వర్కౌట్ కూడా చేసి వచ్చాను. నా తల కొద్దిగా నొప్పిగా ఉంది, కానీ బిర్యానీ తిని, బాగా నిద్రపోతే సెట్ అయిపోతుంది. అందుకే, మీ అందరికీ నా ప్రేమ, బిగ్ హగ్స్. ఈ వార్త విని మీరు ఆందోళన చెందకండి.”
ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ తన కారు దిగి, స్నేహితుడి కారులో హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం. బొలెరో వాహనం డ్రైవర్ పై కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్లిష్ట సమయంలో కూడా అభిమానుల క్షేమాన్ని కోరుతూ విజయ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























