నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా “ది ప్యారడైజ్” నుంచి సీనియర్ యాక్టర్ కలెక్టర్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రఫ్ & మాస్ టచ్‌తో మోహన్ బాబు లుక్‌ని డిజైన్ చేయడం ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంటెన్స్ లుక్‌లో మోహన్ బాబు!
పోస్టర్లో మోహన్ బాబు గారి లుక్ పూర్తిగా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. షర్ట్ లేకుండా, ఛాతీపై బంగారు గొలుసులు వేసుకుని, చేతికి గడియారం (వాచ్) ధరించి, కళ్ళకు స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని కనిపిస్తున్నారు. అంతేకాదు, ఆయన చేతిలో రక్తం చిందిన కత్తి ఉండగా, మరో చేయి రక్తంతో తడిసి ఉంది. ఈ విజువల్ ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా, రఫ్ & రగ్డ్గా ఉంటుందో చెప్పేస్తోంది.
కాగా, ఇప్పటివరకూ తన సుదీర్ఘ సినీ కెరీర్లో హీరోగా, విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా.. డైలాగ్ డెలివరీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు గారు, ఈ పోస్టర్లో యాంటీ హీరో షేడ్స్‌తో మాఫియా డాన్ శైలిలో శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని క్లియర్ అవుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























