ది ప్యారడైజ్ అప్డేట్ రానుంది

big-update-from-the-paradise-loading

దసరా తరువాత నేచురల్ స్టార్ నాని ,డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.సినిమా అనౌన్స్ మెంట్ నుండే వరుస అప్డేట్స్ తో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడంతో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు వున్నాయి.ఇందులో నాని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.రీసెంట్ గా అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు.ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ రానుంది.అందులో భాగంగా ఉదయం 10:08 గంటలకు అలాగే సాయంత్రం 5:04 గంటలకు ఈ అప్డేట్ రివీల్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు సగానికిపైగా కంప్లీట్ అయ్యింది.డిసెంబర్ లోగా బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈసినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండగా కిల్ ఫేమ్ రాఘవ జ్యూయెల్ విలన్ గా నటిస్తున్నాడు.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.ఈసినిమా తెలుగు ,తమిళ, కన్నడ,మలయాళం ,హిందీ తోపాటు బెంగాలీ ,ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో కూడా విడుదలకానుంది.

అయితే ఈసినిమా విడుదలవుతున్న రోజే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చి బాబు సాన ల పెద్ది కూడా రానుంది.ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా వున్నాయి.దాంతో ఒకవేళ రెండు చెప్పిన తేదీకే వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.