ఓజీ రికార్డు ఓపెనింగ్స్

OG first day ww collections

భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ పాజిటివ్ రివ్యూస్ రాబట్టుకోవడంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 154 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. దాంతో ఈసినిమా ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ 151 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా తాజాగా ఓజీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. పవన్ కెరీర్ లో ఇదే మొదటి 100కోట్ల ఓపెనింగ్ మూవీ.అంతేకాదు ఓజీ పవన్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా ఘనత సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ప్రీమియర్స్ పడడంతో పాటు హైక్ తో విడుదలకావడంతో ఓజీ మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఇక ఈసినిమా టార్గెట్ లో మొదటి రోజే సగానికిపైగా రికవరీ చేసింది.ఈమూడు రోజులు ఇదే రేంజ్ లో హవా కొనసాగితే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.

సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ ,శ్రీయా రెడ్డి , అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించారు.బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ గా నటించాడు. తమన్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.