ఓజీ సీక్వెల్ కన్‌ఫర్మ్.. జోష్‌లో పవర్‌స్టార్ ఫ్యాన్స్

Team OG Announces Sequel Pawan Kalyan’s Mega Saga Continues

పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే వార్త అందింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేసిన ‘ఓజీ’ సినిమా నేడు విడుదలై థియేటర్లన్నీ ఇప్పటికే హౌస్‌ఫుల్ షోస్‌తో దద్దరిల్లుతున్నాయి. పవన్ పవర్‌ఫుల్ యాక్టింగ్, సుజీత్ టేకింగ్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – ఇవన్నీ కలిసి ‘ఓజీ’ని ఈ ఏడాది భారీ బ్లాక్‌బస్టర్‌ సినిమాలలో ఒకటిగా నిలబెట్టాయి. ఈ తరుణంలో ఆయన అభిమానులను మరింత ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది!

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓజీ సినిమా ముగిసే సమయంలో క్రెడిట్స్‌లో కనిపించిన ఒక స్పెషల్ కార్డ్ మాత్రం వారిలో మరింత జోష్ నింపింది. అదే – “OG 2 COMING SOON”. దీంతో ఒక్కసారిగా థియేటర్లలోని ఆడియెన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. ఈ ఎండింగ్ కార్డు చూశాక ఫ్యాన్స్ హర్షధ్వానాలు చేస్తూ థియేటర్లు కేరింతలతో మార్మోగాయి. పవన్ ఇక సినిమాలు చేయరని నిరాశ చెందిన అభిమానులకు ఇది నిజంగా శుభవార్తలాంటిదే.

ఈ నేపథ్యంలో అన్నీ చూస్తుంటే, OG 2 మరింత యాక్షన్, ఎమోషన్‌తో ఈసారి అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకునేలా ఉంది. ఇదిలావుంటే, మరోవైపు సోషల్ మీడియాలోనూ #OG2 ట్రెండ్ అవుతుండగా, ఈ సీక్వెల్ ఇంకొన్ని సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు ఉత్సాహంగా పోస్ట్‌లు చేస్తున్నారు. త్వరలోనే ఈ సీక్వెల్‌పై చిత్ర యూనిట్ మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇందుకు సంబంధించి కథలోనూ సీక్వెల్‌కు బలమైన హింట్ ఇచ్చారు. జపాన్ యుకుజిలతో పాటు ముంబై గ్యాంగ్‌స్టర్ డేవిడ్ భాయ్ కూడా ఓజీపై ప్రతీకారం తీర్చుకోవాలని రెడీ అవుతున్నట్లు చూపించడం ఆసక్తి రేకెత్తించింది. అలాగే, సత్యదాదా నుంచి దూరమైన తర్వాత ఓజీ జీవితం జపాన్‌లో ఎలా సాగిందో కూడా రెండో పార్ట్‌లో చూపించబోతున్నారని అభిమానులు ఊహిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.