ఓజాస్ గంభీరకి మెగాస్టార్ అభినందనలు

Megastar Chiranjeevi Congratulates Pawan Kalyan and Team OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ డైరెక్షన్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఓజీ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దీనిపై తన స్పందనను తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌పై చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ ఈ సందేశం పవర్‌స్టార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

https://twitter.com/KChiruTweets/status/1971102596883681704

ఈ సందర్భంగా చిరంజీవి ఎక్స్ వేదికగా.. “కళ్యాణ్ బాబు ఓజాస్ గంభీరగా అందరిచే సెలబ్రేట్ అవుతుండటం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్‌కి, దర్శకుడు సుజీత్‌కి, నిర్మాత దానయ్యకి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కి మరియు మొత్తం నటీ నటుల బృందానికి హృదయపూర్వక అభినందనలు” అని ట్వీట్ చేశారు. అయితే ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్న ఓజీ, మెగా టచ్‌తో మరింత గ్రాండ్‌గా మారింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.