కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ జైలర్ కి సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి 600 కోట్ల వసూళ్లను రాబట్టింది జైలర్. తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది.దాంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా నిన్నటితో కేరళ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇందులో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం.ఇక ఈ షూట్ ముగించుకొని సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు వెళ్లే క్రమంలో మీడియా తో మాట్లాడారు.జైలర్ 2 షూటింగ్ బాగా జరుగుతుంది.జూన్ 12 న సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని అయన అన్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది
ఇక రీసెంట్ గా రజనీకాంత్ కూలీతో ప్రేక్షకుల ముందుకు రాగ ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.అయితే నెగిటివ్ రివ్యూస్ తో కూడా ఈసినిమా 500కోట్లకుపైనే వసూళ్లను రాబట్టింది.లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈసినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























