నా జీవితంలోనే అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ ‘మహాభారతం’ – ఆమీర్ ఖాన్‌

Aamir Khan Gives Big Update on Mahabharat, Confirms Scripting to Begin Soon

బాలీవుడ్ అగ్ర నటుడు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పారు. తన కలల ప్రాజెక్ట్ అయిన భారతీయ ఇతిహాసం ‘మహాభారతం’ గురించి ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను ఇచ్చారు. దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్‌ను తన మనసులో ఉంచుకున్నానని, ఇది తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌ అని ఆయన వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహాభారతం స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే మొదలు!

ఈ మేరకు తాజాగా ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మహాభారతం ప్రాజెక్ట్ తెరకెక్కించే నా కల త్వరలోనే నిజం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అంతర్గత పనులు మొదలయ్యాయి. వచ్చే రెండు నెలల్లో కీలకమైన స్క్రిప్టింగ్ ప్రక్రియ ప్రారంభిస్తాం.” అని వెల్లడించారు.

సినిమాలా కాదు.. ఒక యజ్ఞంలా

‘మహాభారత్’ కేవలం ఒక సినిమా కాదని, అది ఒక ‘యజ్ఞం’ అని ఆమిర్ ఖాన్ అభివర్ణించారు. దీనికి చాలా సమయం పడుతుందని, కానీ దాని ఫలితం గొప్పగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ తరహాలో ఈ సినిమాను అనేక భాగాలుగా రూపొందించే ప్రణాళికలు ఉన్నాయని చెప్పిన ఆయన, దీనికి ఒకరి కంటే ఎక్కువ మంది దర్శకులతో దీనిని తెరకెక్కిస్తానని తెలిపారు.

కాగా ఇటీవలే తాను నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇకపై తాను పూర్తిగా ‘మహాభారత్’పైనే దృష్టి పెడతానని ఆమిర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తాను మరో సినిమా చేయనేమో అన్నంత సంతృప్తి లభిస్తుందని కూడా ఆయన ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇక ఆమిర్ ఖాన్ ఈ తాజా ప్రకటనతో మహాభారతంపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.