యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘మఫ్టీ పోలీస్’ చిత్రాన్ని నిర్మాత జి. అరుళ్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్స్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పవర్ ఫుల్ టీజర్ లాంచ్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో అంచనాలను పెంచింది. స్టైలిష్ మేకింగ్‌తో టీజర్ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉంటుంది. ఇంకొన్నిసార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది. కానీ మొత్తం లెక్కవేసి చూస్తే చివరికి ధర్మమే గెలుస్తుంది’ అని అర్జున్ చెప్పిన డైలాగ్ స్టొరీ సెంట్రల్ ఐడియాని ప్రజెంట్ చేస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఐశ్వర్య రాజేష్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నారు. ఇన్వెస్టగేషన్ సీన్స్ థ్రిల్లింగ్ వున్నాయి.
యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ తొలిసారి కలిసి పనిచేస్తున్నందున ఈ చిత్రంపై హ్యుజ్ బజ్ వుంది. ప్రస్తుతం ఈ టీజర్ ఇంటర్నెట్ అంతటా ప్రేక్షకుల నుండి ప్రశంసలను అందుకుంటోంది. ఇక ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అభిరామి, రామ్‌కుమార్, జి.కె. రెడ్డి, పి.ఎల్. తేనప్పన్, లోగు, వేల రామమూర్తి, తంగదురై, ప్రాంక్‌స్టర్ రాహుల్, ఓ.ఎ.కె. సుందర్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి ఆశివాగన్ సంగీతం అందిస్తుండగా.. శరవణన్ అభిమన్యు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, లారెన్స్ కిషోర్ ఎడిటర్ కాగా, అరుణ్ శంకర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, మేకర్స్ ఇప్పుడు సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో, ట్రైలర్, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























