కన్నడ హీరో కిరీటి రెడ్డి , హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం జూనియర్. జులై లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యావరేజ్ అనిపించుకుంది.కిరీటి కి ఇదే మొదటి సినిమా.ఇందులో తన నటనకు అలాగే ఫైట్స్ ,డ్యాన్స్ కు మంచి పేరొచ్చింది.ఇక థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తరువాత జూనియర్ ఓటీటీలోకి వస్తుంది.అందులో భాగంగా తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 22 నుంచి ఆహా స్ట్రీమింగ్ లోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించిన ఈసినిమాలో జెనీలియా డిసౌజా,వి.రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఇందులో వైరల్ వయ్యారి సాంగ్ సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది.వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజినీ కొర్రపాటి ఈసినిమాను నిర్మించారు.
జూనియర్ కథ :
ఈసినిమా కథ (కిరీటి రెడ్డి) అనే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది.అతడి తండ్రి కోదండపాణి (వి. రవిచంద్రన్) అపారమైన ప్రేమ, అతి జాగ్రత్తతో అభినవ్ ని పెంచుతాడు.చిన్నప్పుడే అభినవ్ తల్లి చనిపోవడం వల్ల, కోదండపాణి,అభినవ్ ని కోల్పోతాననే భయంతో పెంచుతాడు.తండ్రి నుంచి స్వతంత్రత కావాలని, అభినవ్ నగరానికి వెళ్ళి కాలేజీలో చేరుతాడు.అక్కడ అతను హాస్టల్ జీవితాన్ని అనుభవిస్తూ, కొత్త స్నేహితులను సంపాదించుకుంటాడు.తన కాలేజీ స్నేహితురాలు స్ఫూర్తి (శ్రీలీల)తో ప్రేమలో పడతాడు.ఇక కాలేజీ పూర్తయిన తర్వాత, అభినవ్ ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పొందుతాడు.ఆ కుంభకోణాన్ని అభినవ్ బయటపెట్టే క్రమంలో,తన కుటుంబం మరియు తండ్రి గతానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలను కూడా తెలుసుకుంటాడు. సినిమా కథ ఒక కాలేజీ ప్రేమకథ నుంచి కుటుంబ కథా చిత్రంగా మారుతుంది.ఆ తరువాత అభినవ్ తన ఊరికి వెళ్తాడు.ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























