గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి మొదటి పాట త్వరలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ధృవీకరించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా సందర్భంగా చరణ్, చిత్ర యూనిట్‌తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహమాన్‌ని కలుసుకున్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ సింగిల్ కోసం ఎదురుచూపులు
ఈ సినిమాకు ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, మొదటి పాట కోసం అభిమానులే కాకుండా సినీ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని అందరూ నమ్ముతున్నారు.
సినిమాపై అంచనాలు భారీగా..
‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ చూడచక్కగా ఉందని అభిమానులు చెబుతున్నారు. అలాగే, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























