బాలకృష్ణకు గ్లోబల్ అవార్డ్.. పవన్ కళ్యాణ్ సహా సెలబ్రిటీల అభినందనలు

AP Dy CM Pawan Kalyan Congratulates Nandamuri Balakrishna For Receiving Global Honor

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ తరపున ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ పురస్కారానికి ఎంపికయ్యారు. గత ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అశేషమైన కృషి, సేవలకు గాను బాలయ్యకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందింది. అయితే ఈ పురస్కారం అందుకుంటున్న తొలి భారతీయ నటుడు ఆయనే. ఈ నేపథ్యంలో బాలయ్య సహనటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా.. “బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు” అని తెలిపారు.

ఇంకా ఆయన ఇలా న్నారు.. “ఈ శుభ తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.” అని చెప్పారు.

ఇక ఈ సందర్భంగా పలువురు తెలుగు చలనచిత్ర ప్రముఖులు సైతం బాలకృష్ణకు అభినందనలు తెలియజేస్తున్నారు. వీరిలో హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు మరియు టెక్నిషియన్లు ఉన్నారు. కాగా ఆగస్టు 30న హైదరాబాద్‌లో బాలయ్య బాబుకి గొప్ప సత్కారం జరుగబోతోంది. ఈ కార్యక్రమంలో ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రతినిధులు, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.