లిటిల్ హార్ట్స్ రిలీజ్ డేట్ ఛేంజ్

Little Hearts to Arrive One Week Earlier

#90s వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు, యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్. ప్రేమకథా చిత్రంగా  తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మారిందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.మొదట సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలని భావించారు కానీ అదే నెల 5న రావాల్సిన మిరాయ్ వాయిదా పడడంతో లిటిల్ హార్ట్స్ ముందుకు జరిగింది. దాంతో సెప్టెంబర్ 5న లిటిల్ హార్ట్స్ థియేటర్లోకి రానుంది. అయితే అదే రోజు అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి కూడా రిలీజ్ అవుతుండడం తో బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ కి పోటీ ఎదురుకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాయి మార్తాండ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఫేమ్ శివాని నాగారం ఇందులో హీరోయిన్ గా నటించింది. #90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మించాడు.ఇక ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు.

ఈ మూవీలో కొత్త తరం నటీనటులు నటించారు. యూత్‌కు దగ్గరగా ఉండే లవ్ స్టోరీ, ఫ్యామిలీ టచ్ కలిపి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయని టీమ్ చెబుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.