పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన చిత్రాలలో ‘తమ్ముడు’ ఒకటి. పాత సినిమాలను 4Kలో మళ్లీ చూసే ట్రెండ్‌లో ఇప్పుడు ఆయన నటించిన ఈ ఆల్ టైమ్ క్లాసిక్ కూడా చేరింది. ఆగస్టు 30వ తేదీన ఈ చిత్రం మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ్ముడు4K రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ అదిరిపోయింది
తమ్ముడు ట్రైలర్ 4K క్వాలిటీలో అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్స్, ఎనర్జీని 4Kలో చూడటం అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా, పవన్ చెప్పిన ఐకానిక్ డైలాగ్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, మరియు ఐకానిక్ సాంగ్ ‘Look at My Face in the Mirror’ 4Kలో మరింత స్పష్టంగా, అందంగా కనిపిస్తున్నాయి. అప్పట్లో రికార్డులు సృష్టించిన ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు ఇప్పుడు 4Kలో మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.
సినిమాకు ఆల్ టైమ్ క్లాసిక్ స్టేటస్
కాగా పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బురుగుపల్లి శివరామకృష్ణ ఉన్నత ప్రమాణాలతో నిర్మించారు. రమణ గోగుల అందించిన సంగీతం చార్ట్ బస్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ సరసన ప్రీతి జింగానియా, అదితి గోవిత్రికర్ కథానాయికలుగా నటించగా.. బ్రహ్మానందం, అచ్యుత్, భూపిందర్ సింగ్, బ్రహ్మానందం, అలీ, మల్లికార్జునరావు వంటివారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
తమ్ముడు సినిమా 1999లో విడుదలైనప్పటికీ, ఇప్పటికీ యువతకు ఒక స్ఫూర్తి. ఈ సినిమా అప్పట్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాలోని ప్రేమ కథ, యాక్షన్, భావోద్వేగాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ఎంతో ప్రత్యేకమైనవి. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాకుండా పవన్ ఇమేజ్‌ని, క్రేజ్‌ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమాను 4Kలో రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించడం, పవన్ అభిమానులకు ఒక గొప్ప కానుక.
ఈ ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మెగా ఫ్యాన్స్ పూనకాలు లోడింగ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2)ను పురస్కరించుకుని రెండు రోజుల ముందుగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో మళ్లీ థియేటర్లలో ‘తమ్ముడు’ సందడి చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























