యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందించబోతున్నాడు. కాగా తాజాగా చిరంజీవి జన్మదినం సందర్భంగా శ్రీకాంత్ ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ, సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా శ్రీకాంత్ ఓదెల చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. “నువ్ నా డెమి-గాడ్! చిరంజీవితో ఒక ఫోటో దిగి ఇంట్లో అమ్మకు చూపిస్తే – ఫస్ట్ టైమ్ నువ్వు ఫోటోలో నవ్వడం చూస్తున్నారా అని చెప్పింది. అది చిరంజీవికి నా నిర్వచనం. ఏం చేస్తాడు చిరంజీవి అంటే.. నా లాంటి ఇంట్రావర్ట్ గాడితో ఇంద్ర స్టెప్ చేయించగలడు, సినిమా టిక్కెట్లు కొన్నుకునేవాడితో సినిమా తీయించగలడు.” అని అందులో పేర్కొన్నాడు.
అంతేకాకుండా ఇంకా ఆయన ఇలా చెప్పాడు.. “నీ యమ్మ – జీవితకాలం అదే సినిమా రా చిరంజీవి. ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే! జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. చివరకు! తెరపై నా చిరంజీవిని మిస్ అవుతున్నాను. నేను అతనిని తిరిగి తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నాను! నా కోసం నేనే తీస్తున్న సినిమా ఇది. నా లాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం చేస్తున్న సినిమా #ChiruOdela. ఇది బ్లడ్ ప్రామిస్. “T-REX” మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.” అని తెలిపాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























