300 కోట్ల దిశగా మహావతార్ నరసింహ

Mahavatar Narsimha Racing Towards 300 Cr Mark

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద డ్రీం రన్ ను కొనసాగిస్తుంది. విడుదలై నెల రోజులకు వస్తున్నా ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది.ఇప్పటికే అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా రికార్డు సృష్టించగా నిన్నటి తో ప్రపంచవ్యాప్తంగా 278 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈ వీకెండ్ లో 300 కోట్ల క్లబ్ లో చేరనుంది.కేవలం 15కోట్ల బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా బయ్యర్లకు ఊహించని లాభాలను తీసుకొస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిందీలో అయితే ఇప్పటికీ అదరగొడుతుంది.కొత్త సినిమాలతో పోటీని తట్టుకొని మరీ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటితో హిందీ వెర్షన్ దేశ వ్యాప్తంగా 165 కోట్ల కుపైగా నెట్ వసూళ్లను రాబట్టుకుంది. ఫుల్ రన్ లో 175 కోట్ల క్లబ్ లో చేరనుంది.

ఇక తెలుగులోనూ ఈసినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేశారు.విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించగా  సామ్ సీఎస్ సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.