భోగి నుండి డింపుల్ హయాతి బర్త్ డే పోస్టర్‌ రిలీజ్

Team Bhogi Released Special Poster of Dimple Hayathi on Her Birthday

చార్మింగ్ స్టార్ శర్వానంద్, విజనరీ డైరెక్టర్ సంపత్ నంది కొలాబరేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భోగి’. 1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో జరిగిన కథతో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఇందులో నటిస్తోన్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటి డింపుల్ హయాతి జన్మదినం సందర్భంగా, ‘భోగి’ చిత్ర బృందం ఆమెకు ఒక ప్రత్యేక బహుమతిని అందించింది. ఈ సినిమా నుండి డింపుల్ హయతి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసి, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ‘భోగి’ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

ఈ పోస్టర్‌లో డింపుల్ హయతి తెలుపు రంగు దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఆమె నవ్వు, కళ్ళలో కనిపించిన అమాయకత్వం పాత్రకు జీవం పోస్తున్నాయి. పోస్టర్ చూస్తుంటే, ఆమె ఈ సినిమాలో పక్కింటి అమ్మాయి లాగా, ఎంతో సాధారణమైన పాత్రలో కనిపిస్తున్నారని అర్థమవుతోంది. ఈ లుక్ ఆమెకు చాలా కొత్తగా ఉంది.

ఇది ఆమె కెరీర్‌లో అత్యంత ఉత్తేజకరమైన పాత్రలలో ఒకదానితో కూడిన అద్భుతమైన చిత్రం అవుతుంది అని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక గతంలో డింపుల్ ‘గద్దలకొండ గణేష్’, ‘ఖిలాడి’ వంటి చిత్రాలలో గ్లామరస్ పాత్రలలో కనిపించారు. కాగా భోగిలో డింపుల్ హయతితో పాటు మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.