వార్ 2 ,కూలీ సినిమాలకు టికెట్ హైక్ లేదు

No Increase in Ticket Rates for War 2 and Coolie in nizam

మరో రెండు రోజుల్లో రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే వాటి మ్యానియా స్టార్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు కానీ మిగితా భాషల్లో ఆ రెండు సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగోడుతున్నాయి. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే కూలీ , వార్ 2. ఇందులో కూలీ తమిళ్ తోపాటు మిగితా భాషల్లోనూ సాలిడ్ ప్రీ బుకింగ్స్ అవుతున్నాయి. ఈ విషయంలో మాత్రం వార్ 2 కొంచెం వెనుకబడింది.కూలీకి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 70కోట్ల పైనే ప్రీ సేల్స్ అయ్యాయంటే ఏ రేంజ్ హైప్ వుందో అర్ధం చేసుకోవచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కావాల్సివుంది. ఈరెండు సినిమాల థియేట్రికల్ రైట్స్ ను తెలుగు నిర్మాతలు భారీ ధరకు దక్కించుకున్నారు.దాంతో రికవరీ కోసం రెండు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంపు కోసం ప్రభుత్వాలకు దరఖాస్తు చేస్తున్నారు. అయితే తెలంగాణ లో మాత్రం రెండు సినిమాలకు నిరాశే ఎదురైంది. టికెట్ ధరల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది.ఎర్లీ మార్కింగ్ షోస్ కూడా 6లేదా 7గంటలకు స్టార్ట్ అయ్యే ఛాన్స్ వుంది.

ఇక ఆంధ్రాలో మాత్రం రెండు సినిమాలకు హైక్ ఉండొచ్చు.మరి కొద్దీ గంటల్లో క్లారిటీ రానుంది. టికెట్ హైక్ జీవో రిలీజ్ అయ్యాక రెండు రాష్ట్రాల్లో ఒకేసారి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.ఇక చాలా రోజుల తరువాత రెండు పెద్ద సినిమాలు క్లాష్ కి దిగుతున్నాయి.మరి ఇందులో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.